తీవ్ర మాంద్యంలోకి వరల్డ్ ఎకానమీ

తీవ్ర మాంద్యంలోకి వరల్డ్ ఎకానమీ
  • ఐఎంఎఫ్ చీఫ్ హెచ్చరిక

వాషింగ్టన్: కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యంలోకి వెళ్తుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. కరోనా ప్రబలడానికి ముందే ట్రేడ్ డిస్ప్యూట్స్, పాలసీల్లో అనిశ్చితి ఇతర సమస్యల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్లోడౌన్ లో ఉందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా అన్నారు. ఐఎంఫ్, వరల్డ్ బ్యాంక్ డెవలప్ మెంట్ కమిటీ మీటింగ్ లో ఆమె మాట్లాడుతూ… ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన క్రైసిస్ వల్ల అన్ని దేశాలు సవాళ్లను ఎదుర్కోవడం అనివార్యమైందన్నారు. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి తీసుకున్న ట్రావెల్ బ్యాన్, సోషల్ డిస్టెన్సింగ్ లాంటి చర్యలు దీర్ఘకాలం ప్రభావం చూపుతాయని చెప్పారు. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. చైనా, సౌత్ కొరియా, ఇటలీ దేశాలపై ముందుగానే తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. ఇప్పటికే అన్ని దేశాలు ఖర్చులు తగ్గించే పనిలో పడ్డాయన్నారు. మూడో క్వార్టర్ నాటికి వరల్డ్ ఎకానమీ రికవర్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు.