శ్రీజేశ్‌కు వరల్డ్‌‌ గేమ్స్‌‌ అథ్లెట్‌‌ ఆఫ్‌‌ ది ఇయర్‌‌ 2021 అవార్డు

  శ్రీజేశ్‌కు వరల్డ్‌‌ గేమ్స్‌‌ అథ్లెట్‌‌ ఆఫ్‌‌ ది ఇయర్‌‌ 2021 అవార్డు

న్యూఢిల్లీ: ఇండియా హాకీ టీమ్‌‌‌‌ గోల్‌‌ కీపర్‌‌ పీఆర్‌‌ శ్రీజేశ్‌‌ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. వరల్డ్‌‌ గేమ్స్‌‌ అథ్లెట్‌‌ ఆఫ్‌‌ ది ఇయర్‌‌ 2021 అవార్డును శ్రీజేష్‌‌ గెలుచుకున్నాడు. ఈ పురస్కారం అందుకున్న సెకండ్‌‌ ఇండియన్‌‌గా నిలిచాడు. 2020లో ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌ కెప్టెన్‌‌ రాణి రాంపాల్‌‌ ఫస్ట్‌‌ టైమ్‌‌ ఈ ఘనత సాధించింది. ఇండియా మాజీ కెప్టెన్‌‌ అయిన శ్రీజేశ్‌‌.. టోక్యో ఒలింపిక్స్‌‌లో హాకీ టీమ్‌‌ బ్రాంజ్‌‌ మెడల్‌‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో, 33 ఏళ్ల ఈ వెటరన్‌‌ ప్లేయర్‌‌ను ఈ అవార్డు కోసం ఇంటర్నేషనల్‌‌ హాకీ ఫెడరేషన్‌‌ (హెచ్‌‌ఎఫ్‌‌ఐ) నామినేట్‌‌ చేసింది. ఓటింగ్‌‌లో శ్రీజేశ్​కు అందరికంటే ఎక్కువగా లక్షా 27 వేల 647 ఓట్లు వచ్చాయి.

సెకండ్‌‌ ప్లేస్‌‌లో నిలిచిన స్పెయిన్‌‌కు చెందిన రాక్‌‌ క్లైంబర్‌‌ ఆల్బర్టో లోపేజ్‌‌కు 67,428 ఓట్లు రాగా, ఈ అవార్డు కోసం పోటీ పడ్డ ఇటలీ ఉషు ప్లేయర్‌‌ జియార్డనోకు 52,046 ఓట్లే వచ్చాయి. ఇంత గొప్ప అవార్డుకు ఎంపికవడం తనకు గర్వకారణం అని శ్రీజేశ్‌‌ అన్నాడు. తనను నామినేట్​ చేసిన హెచ్‌‌ఎఫ్‌‌ఐకి, ఓటు వేసిన ఇండియన్‌‌ హాకీ ఫ్యాన్స్‌‌కు థ్యాంక్స్‌‌ చెప్పాడు. టోక్యోలో బ్రాంజ్‌‌ గెలిచిన తన టీమ్‌‌మేట్స్‌‌కు ఈ అవార్డును డెడికేట్ చేస్తున్నట్టు తెలిపాడు.