ప్రపంచంలో స్ట్రాంగెస్ట్​ పాస్‌పోర్ట్ ఏ దేశానిదో తెలుసా?

ప్రపంచంలో స్ట్రాంగెస్ట్​ పాస్‌పోర్ట్  ఏ దేశానిదో తెలుసా?

హెన్రీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023 నివేదికను జులై 19న విడుదల చేసింది. ఇందులో 199 విభిన్న పాస్‌పోర్ట్‌లు, 227 ప్రయాణ గమ్యస్థానాలు ఉన్నాయి.  ఈ  నివేదిక ప్రకారం స్ట్రాంగెస్ట్​ పాస్​పోర్టు అగ్రస్థానాన్ని  సింగపూర్ ఆక్రమించింది.  ఇది ప్రపంచవ్యాప్తంగా 227 దేశాలలో 192 దేశాలకు వీసా-రహిత యాక్సెస్‌ని అందిస్తోంది. గతంలో జపాన్ ఐదేళ్లపాటు ఈ స్థానంలో ఉండేది.  రెండో ప్లేస్​లో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ ఉన్నాయి. 

ఇవి ఒక్కొక్కటి 190 దేశాలకు ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. జపాన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్,  ఫ్రాన్స్ 189 దేశాలు సైతం మూడో  స్థానాన్ని ఆక్రమించాయి.యునైటెడ్ కింగ్‌డమ్ పై రెండు స్థానాలు పైకి ఎగబాకి, నాలుగో స్థానంలో నిలిచింది.   యునైటెడ్ స్టేట్స్ 184 దేశాలకు యాక్సెస్‌తో రెండు స్థానాలు దిగజారి ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఆఫ్ఘనిస్తాన్ 27 స్కోర్‌తో ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన పాస్‌పోర్ట్‌గా అట్టడుగు స్థానంలో ఉంది. 

తొలి పది స్ట్రాంగ్​పాస్​పోర్ట్​ కలిగిన దేశాలివే..

1. సింగపూర్
2. జర్మనీ, ఇటలీ, స్పెయిన్
3. ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, లక్సెంబర్గ్, దక్షిణ కొరియా,  స్వీడన్
4. డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్‌డమ్
5. బెల్జియం, చెక్ రిపబ్లిక్, మాల్టా, న్యూజిలాండ్, నార్వార్, పోర్చుగల్, స్విట్జర్లాండ్
6. ఆస్ట్రేలియా, హంగరీ, పోలాండ్
7. కెనడా, గ్రీస్
8. లిథువేనియా, యునైటెడ్ స్టేట్స్
9. లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా
10. ఎస్టోనియా, ఐస్లాండ్

భారత్​స్కోర్​ఇదే..

టోగో, సెనెగల్‌లతో పాటు భారతదేశం ఈ సంవత్సరం ఆరంభం నుండి ఏడు స్థానాలు ఎగబాకి 80వ స్థానానికి చేరుకుంది. ఇప్పుడు ప్రపంచంలోని 57 దేశాలకు వీసా-రహిత అనుమతిని భారత్​ అందిస్తోంది. అధిక ర్యాంక్ ఉన్నప్పటికీ, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు సందర్శించగల దేశాల సంఖ్య మూడుకి తగ్గింది. 2022 ర్యాంకింగ్స్‌లో ఇండియా 87వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం కంటే ఏడు స్థానాలు గణనీయంగా మెరుగుపడింది.   

హెన్రీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అంటే...

హెన్రీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్  ప్రయాణ సమాచారానికి సంబంధించి  కచ్చితమైన డేటాబేస్ను అందిస్తుంది. ఇది ఏటా పాస్​పోర్టు నివేదికలను విడుదల చేస్తుంది.