రష్యాలో గుడ్లు అయిపోతున్నాయి.. అందుకు అధ్యక్షుడు పుతినే కారణమా?

రష్యాలో గుడ్లు అయిపోతున్నాయి.. అందుకు అధ్యక్షుడు పుతినే కారణమా?

రష్యాలో గుడ్లు అయిపోతున్నాయట.. రష్యన్ల హాలిడే డిష్ లలో ప్రధానమైన గుడ్ల సరఫరా చాలా తగ్గిందట. దీంతో గుడ్ల ధరలు వరుసగా నాలుగు వారాల పాటు 4శాతం కంటే అధికంగా పెరుగుతూ వస్తున్నాయి.ఈ ఏడాది 2023 ప్రారంభం నుంచి ఇప్పటివరకు రష్యన్లు చెల్లించే ధర గుడ్ల ధర 42శాతం పెరిగిందని నివేదికలు చెపుతున్నాయి. 

అధిక  ద్రవ్యోల్బణం, ఆర్థిక ఆంక్షల మధ్య  పెరుగుతున్న గుడ్డు ధరలు రష్యా అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రత్యేకించి గుడ్లు పండగ సీజన్ లో ఈ షార్టేజీ రష్యన్లును కలవర పెడుతోంది. 

దక్షిణ రష్యాలోని కుబాన్ నుంచి నోవోసిబిర్క్స్ వరకు తూర్పున 2వేల మైళ్ల దూరం లోఉన్న సైబీరియాలో గుడ్లకోసం రష్యన్లు దుకాణాల ముందు క్యూ కట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో చెల్లించి గుడ్లు కొనలేని వారు ఉమ్మడిగా కార్టన్ కు డబ్బులు చెల్లించింది గుడ్లు కొనుగోలు చేస్తున్నారట. 

దక్షిణాది నగరమైన బెల్గోరోడ్ లో 150 రూబిళ్లు (1.67 డాలర్లు ) కంటే ఎక్కువగా ఉన్న సూపర్ మార్కెట్ ధర కు విరుద్ధంగా 10 గుడ్లు 65 రూబిళ్లకు లభ్యమవుతున్నాయి. అంటే పది గుడ్ల ధర రూ. 72లు అన్నమాట 

ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ పై పూర్తిస్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటినుంచి  రష్యా దేశంపై విధించిన ప్రతీకార చర్యలతో ఆదేశంలో ఇలాంటి కొరత ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్యలను ధైర్యంగా ఎదుర్కొంటున్నట్లు క్రెమ్లిన్ చెపుతోంది. మూడవ త్రైమాసికంలో 5.5 శాతం వృద్ధి ఉందని ప్రకటించింది. 

అయితే రష్యా ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, పాశ్చాత్య దేశాల  ఆంక్షలతో పోరాడుతుండటం, పుతిన్ మొండి వైఖరి వల్లే ఈ దుస్థితి వచ్చిందని మాస్కో ప్రజలు కొందరు విమర్శిస్తున్నారు. అయితే గుడ్ల కొరత సమస్య పరిష్కరించాలని రష్యా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిత్ర దేశాలనుంచి గుడ్లను దిగుమతి చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఆయా దేశాలను గుడ్ల దిగుమతికి సుంకాన్ని తగ్గించినట్లు రష్యన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ  తెలిపింది.