WPL Season 4: మొదలైన మహిళల టీ20 సమరం: తొలి మ్యాచ్‎లో టాస్ గెలిచిన ఆర్సీబీ

WPL Season 4: మొదలైన మహిళల టీ20 సమరం: తొలి మ్యాచ్‎లో టాస్ గెలిచిన ఆర్సీబీ

న్యూఢిల్లీ: క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) సంబరం షూరు అయ్యింది. శుక్రవారం (జనవరి 9) నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా డబ్ల్యూపీఎల్ సీజన్ 4కు తెరలేచింది. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‎లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్లు తలపడుతున్నాయి. 

ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందనా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండటంతో మ్యాచ్‎పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. విజయంతో టోర్నీని ఆరంభించాలని గెలుపే లక్ష్యంగా ముంబై, ఆర్సీబీ బరిలోకి దిగాయి. 

ముంబై ఇండియన్స్ స్వ్కాడ్:

నాట్ స్కివర్-బ్రంట్, జి కమలిని (వారం), అమేలియా కెర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), అమంజోత్ కౌర్, నికోలా కారీ, పూనమ్ ఖేమ్నార్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సజీవన్ సజన, సైకా ఇషాక్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు:

స్మృతి మంధాన (సి), గ్రేస్ హారిస్, దయాళన్ హేమలత, రిచా ఘోష్ (వారం), రాధా యాదవ్, నాడిన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ప్రేమ రావత్, లిన్సే స్మిత్, లారెన్ బెల్