యాచారంలో పూడ్చిపెట్టిన.. 100 కుక్కలకు పోస్టుమార్టం

యాచారంలో పూడ్చిపెట్టిన.. 100 కుక్కలకు పోస్టుమార్టం

యాచారంలో 100 కుక్కలకు విషం ఇచ్చి చంపిన కేసు కీలక మలుపు తిరిగింది.స్వచ్ఛంద సంస్థల ఫిర్యాదుమేరకు పాతిపెట్టిన కుక్కలకు పోస్టు మార్టమ్ చేశారు. శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నారు. వివరాల్లోకి వెళితే.. 

కొద్ది రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో 400 కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపిన ఘటన తర్వాత అలాంటి దే మరో దారుణం రంగారెడ్డి జిల్లా యాచారం లో కూడా జరిగింది. ఈ ఘటన పై గ్రామ సర్పంచ్, కార్యదర్శిపై కేసు నమోదు చేశారు  పోలీసులు. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన ఫిర్యాదుతో  కుక్కల కళేబరాలకు పోస్ట్ మార్టమ్ నిర్వహించాలని నిర్ణయించారు. 

గురువారం(జనవరి 22)  ఉదయం కుక్కలకు వెటర్నరీ డాక్టర్లు పోస్టుమార్టమ్ నిర్వహిస్తున్నారు. యాచారం డంపింగ్ యార్డు సమపీంలో గుంతలో పాతిపెట్టిన కుక్కల కళేబరాలను జేసీబీతో తవ్వించి బయటికి తీశారు.ఒక్కొక్కదానికి పోస్ట్ మార్టమ్ చేసి తిరిగి పాతిపెట్టారు. కుక్కల శాంపిల్స్ ను తీసుకొని ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నారు. 

యానిమల్​ఫౌండేషన్​ ఫిర్యాదు, మేనకా గాంధీ చొరవతో విచారణ స్పీడప్​చేసిన సీఐ నందీశ్వర్ రెడ్డి కేసు నమోదు చేసి, కుక్కలను పాతి పెట్టిన చోటును గుర్తించారు. గురువారం ఉదయం వాటినన్నింటినీ వెలికి తీసి పోస్ట్​మార్టం చేశారు. 

ఈ విషయమై యానిమల్​రైట్స్​యాక్టివిస్ట్, మాజీ ఎంపీ​మేనకా గాంధీకి కూడా ఫోన్​ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన ఆమె.. జిల్లా కలెక్టర్​నారాయణ రెడ్డికి కాల్​చేసి వివరాలడిగారు. దీంతో ఆయన పోలీసులతో మాట్లాడారు. యాచారం గ్రామ పంచాయతీలో సుమారు 8 వేల మంది జనాభా ఉండగా, ఇక్కడ భారీ సంఖ్యలో కుక్కలు తిరుగుతున్నాయని, పిల్లలను కరుస్తున్నాయని సర్పంచ్​మస్కు అనిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషన్ నాయక్ కు గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేశారు.