గర్భిణులు సేఫ్టీ డెలివరీ కోసం యాక్షన్ ప్లాన్ : అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు 

గర్భిణులు సేఫ్టీ డెలివరీ కోసం యాక్షన్ ప్లాన్ : అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు 

యాదాద్రి, వెలుగు : గర్భిణులు సేప్టీ నార్మల్​ డెలివరీ కోసం యాక్షన్​ ప్లాన్​ రెడీ చేసుకోవాలని యాదాద్రి అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కరరావు ఆదేశించారు. హెల్త్ వీక్ లో భాగంగా కలెక్టరేట్​లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డెలివరీ సమయం దగ్గరపడిన గర్భిణీని సమీపంలోని హాస్పిటల్​కు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీ జరిగేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో డాక్టర్​ మనోహర్​, డాక్టర్లు ఉన్నారు.