
వెలుగు: యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనర్సింహస్వామి బుధవారం గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అర్చకులు గోవర్ధనగిరిధారి అలంకార విశిష్టతను భక్తులకు వివరించారు. రాత్రి స్వామి వారిని సింహవాహనంపై ఊరేగించారు. గురువారం జగన్మోహిని అలంకారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. రాత్రి అశ్వవాహన సేవ అనంతరం ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించి ధార్మిక, సంగీత మహాసభలు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి.