
యాదగిరికొండ, వెలుగు : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం స్వామి వారు ఉదయం మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చా రు. అర్చకులు, అధికారులు బాలాలయంలో ఊరేగించారు. ఈ నెల 8 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించి ఉత్సవ ప్రాధాన్యతను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు యాదాద్రి ఆలయ అధికారులు తెలిపారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం వేళల్లో అలంకారసేవలు, రాత్రి వేళల్లో శ్రీవారి వాహనసేవలు ప్రతీ రోజు జరుగుతాయన్నారు. రాష్ట్ర గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ విశిష్ట అతిధిగా 15న ఉదయం కళ్యాణోత్సవానికి హాజరుకానున్నట్లు తెలిపారు.