- లబ్ధిదారులను ఆరా తీసిన కలెక్టర్
యాదాద్రి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం జిల్లాలోని గుండాల మండలం అనంతారంలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను పరిశీలించారు. ఇండ్ల బిల్లులు అకౌంట్లో పడుతున్నయా..? అని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా నిర్మాణం పూర్తి చేసుకొని గృహ ప్రవేశం చేయాలని సూచించారు.
శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ సెంటర్లకు కొత్త బిల్డింగ్‌కు శాంక్షన్ చేయిస్తానని తెలిపారు. బీబీనగర్‌లోని వయో వృద్ధుల డే కేర్ సెంటర్‌ను సందర్శించారు. వృద్ధులకు అందిస్తున్న వైద్య సేవలు, చికిత్స విధానాలపై ఆరా తీశారు. అనంతరం పలు కొనుగోలు సెంటర్లను పరిశీలించి, కొనుగోళ్లలో స్పీడ్ పెంచాలని ఆయన ఆదేశించారు.
