వటపత్రశాయిగా యాదాద్రి నారసింహుడు

వటపత్రశాయిగా యాదాద్రి నారసింహుడు

వెలుగు: యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి మంగళవారం వటపత్రశాయిగా దర్శనమిచ్చారు. ఐదో రోజు స్వామి వారిని వటపత్రంపై అధిష్టిం పజేసి పూజలు నిర్వహించారు. సాయంత్రం పొన్నవాహన సేవలో బాలాలయంలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల కైంకర్యాల్లో భాగంగా బాలాలయంలో రుత్వికులు మంగళవారం నిత్య హోమం జరిపి పారాయణాలు నిర్వహించారు. స్వామి వారి అలంకార సేవ ముందు ప్రబంధ పారాయణాలు, మూల మంత్ర జపాలు చేశారు. కాగా బుధవారం నుంచి ధార్మిక, సంగీత, సాహిత్య మహాసభలు ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉదయం గోవర్ధనగిరి ధారిగా దర్శనమివ్వనున్నారు . రాత్రి సింహవాహన సేవపై ఊరేగిస్తారు.