ఆరేండ్ల నిరీక్షణ అనంతరం యాదాద్రిలో అద్బుత ఘట్టం 

ఆరేండ్ల నిరీక్షణ అనంతరం యాదాద్రిలో అద్బుత ఘట్టం 
  • భక్తులకు దర్శనమీయబోతున్న స్వయంభూ లక్ష్మీ నారసింహుడు 
  • స్వామి వారిని దర్శించుకునే తొలి భక్తుడు సీఎం కేసీఆర్ 

యాదాద్రి భువనగిరి జిల్లా : ఆరేండ్ల నిరీక్షణ అనంతరం యాదాద్రిలో అద్బుత ఘట్టం ఆవిష్కరించబోతోంది. స్వయంభూ లక్ష్మీ నారసింహుడు భక్తులకు దర్శనమీయబోతున్నాడు. మరికొన్ని గంటల్లో మహాకుంభ సంప్రోక్షణ పూర్తికానుంది. స్వామి వారిని దర్శించుకునే తొలి భక్తుడు సీఎం కేసీఆర్ కాబోతున్నారు. ఆ తర్వాత సాధారణ భక్తులకు స్వామి వారు దర్శనమిస్తారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత యాదగిరిగుట్టలోని లక్ష్మీ నారసింహుడి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. వైటీడీఏ ఏర్పాటు చేసి రూ. 1200 కోట్లతో పునర్మించడానికి ప్రణాళికలు రూపొందించారు. బాలాలయం ఏర్పాటు చేసి స్వామి కవచమూర్తులను చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్టించారు.  26 ఏప్రిల్ 2016 నుంచి స్వామి వారిని బాలాలయంలోనే స్వామి వారిని భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. కొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేసిన లైటింగ్ తో యాదాద్రి కొండ మెరిసిపోతోంది. 
కుటుంబ సమేతంగా హాజరుకానున్న సీఎం కేసీఆర్
మహాకుంభ సంప్రోక్షణకు సీఎం కేపీఆర్, ఆయన కుటుంబ సభ్యులు హాజరు . వీరి కోసం ప్రెసిడెన్షియల్ సూట్లలో బస చేస్తున్నారు. మంత్రులు, ఇతర పెద్ద ఎత్తున వీఐపీల కోసం గుట్టలోని అన్ని సత్రాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఒక్కో సత్రం, వీఐపీల బాధ్యత  ఒక్కో జిల్లా ఆఫీసర్లకు అప్పగించారు. యాగశాల కోసం ఏర్పాటు చేసిన 50 ఎకరాల స్థలంలో వీఐపీలకు భోజనాలు ఏర్పాటు చేశారు. యాగశాల ప్రాంగణంలోకి వీఐపీలు తప్ప ఇతరులకు అనుమతి లేదు. మహాకుంభ  సంప్రోక్షణ సందర్భంగా మధ్యాహ్నం వరకూ సామాన్య భక్తులకు అనుమతి లేదు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సామాన్య భక్తులకు స్వయంభూ శ్రీ లక్ష్మీ నారసింహుల వారి దర్శనానికి అనుమతిస్తారు. యాదాద్రి 
లయం మొత్తం పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వెళ్లింది.

ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి.
ఉదయం 9.30 నుంచి 10.30 వరకు బాలలాయం నుంచి ప్రధాన ఆలయం వరకు శోభాయాత్ర.
ఉదయం 11.15 వరకు స్వామి వారి ఆరాధన. వైదిక కార్యక్రమాలు.
ఉదయం 11.55కు మహాకుంభ  సంప్రోక్షణ.  అనంతరం ప్రధాన ఆలయంలోకి ప్రవేశం. ఆ తరవాత స్వర్ణ ధ్వజస్తంభ దర్శనం. 
మధ్యాహ్నం 12.30 వరకు స్వామి వారి గర్భాలయ దర్శనం.
మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ కార్యక్రమాలు కొనసాగింపు.