- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేలా యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఎక్స్ అఫీషియోగా సభ్యుడిగా చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికలో పాల్గొని తన ఓటును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలుచుకుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ బరిగె రమ్య రాంచందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
