- అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రెసిడెంట్ బండి సదానందం యాదవ్
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సహకారంతో త్వరలోనే జిల్లాలో యాదవ సంఘం భవనాల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఓ ఫంక్షన్హాల్లో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవ కులస్తులంతా కలిసిమెలిసి ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు. యాదవ కుల సంఘం భవనాల నిర్మాణం, ఆర్థిక చేయూత, ఇతర సంక్షేమ అవసరాలను కల్పించాలని మంత్రి వివేక్వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సమావేశంలో మంచిర్యాలలోని 18 మండలాలకు చెందిన యాదవ కుల సంఘం ముఖ్య లీడర్లు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై పలు తీర్మానాలు చేశారు.
