
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి కేసులు ఎక్కువ కావడంతో గత కొన్ని రోజులుగా దాదాపు 73 మంది ఆలయ సిబ్బంది, అర్చకులు వైరస్ బారినపడ్డారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆర్జిత సేవలు, అన్నప్రసాదం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు లేకుండానే ఏకాంతంగా దైవారాధనలు చేయనున్నట్లు చెప్పారు. అయితే లఘుదర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.