
ముంబై: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఫారెన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినందుకు యామీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈనెల ఏడో తేదీన తమ ముందు హాజరుకావాలని ఆమెను ఈడీ ఆదేశించింది. ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో రూ.1.5 కోట్ల డబ్బుకు సంబంధించి జరిపిన లావాదేవీల వివరాలను బహిర్గతం చేయనందుకే యామీకి ఈడీ నోటీసులు ఇచ్చిందని సమాచారం. ఈడీ నుంచి యామీ నోటీసులు అందుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతేడాది తొలిసారి ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో విచారణకు యామీ హాజరు కాలేదని తెలుస్తోంది. ఇకపోతే, రీసెంట్‌గా ఆదిత్య ధర్‌ను యామీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.