సినర్ సూపర్.. యూఎస్ ఓపెన్ నెగ్గిన వరల్డ్ నం.1

సినర్ సూపర్.. యూఎస్ ఓపెన్ నెగ్గిన వరల్డ్ నం.1

న్యూయార్క్‌: డోపింగ్‌, సస్పెన్షన్ వేటు వివాదాల నడుమ యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓపెన్‌లో బరిలోకి దిగి.. ఆడిన తొలి సెట్‌నే కోల్పోయిన వరల్డ్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్ యానిక్‌‌ సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాజిక్  చేశాడు. అంచనాలకు మించి రాణిస్తూ  ముందుకొచ్చిన ఇటలీ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెగా టోర్నీ  మెన్స్ సింగిల్స్  టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి ఆర్థర్ ఆషె స్టేడియంలో జరిగిన ఫైనల్లో టాప్ సీడ్  సినర్ 6–3, 6–4, 7–5తో వరుస సెట్లలో లోకల్ ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌ను చిత్తు చేశాడు.  డ్రగ్ టెస్టుల్లో రెండుసార్లు పట్టుబడి.. సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేటు తప్పించుకున్న 23 ఏండ్ల  సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడు వారాల్లోనే మెగా టోర్నీలో విజేతగా నిలిచాడు. దాంతో తన కెరీర్‌లో  రెండో గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్లామ్ ఖాతాలో వేసుకున్నాడు.

 ఈ సీజన్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌లోనూ అతను విజేతగా నిలిచాడు. యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓపెన్‌‌‌‌‌కు ముందు తన కెరీర్‌లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని, అందుకే ఈ టైటిల్ తనకు ఎంతో ముఖ్యమైనదని సినర్‌‌‌‌‌‌‌‌‌చెప్పాడు. మొత్తంగా యూఎస్ ఓపెన్ గెలిచిన రెండో ఇటాలియన్‌‌‌‌గా సినర్ నిలిచాడు. 2015లో ఫ్లేవియా పెనెటా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైటిల్ నెగ్గింది. మరోవైపు ఈ పోరులో ఓటమితో 21 ఏండ్ల తర్వాత మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగిల్స్‌లో గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్లామ్ నెగ్గిన అమెరికన్‌‌‌‌గా నిలవాలని ఆశించిన టేలర్ ఫ్రిట్జ్‌‌‌ కల చెదిరింది.  చివరగా ఆండీ రాడిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2003 యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌లో  విజేతగా నిలిచాడు. అప్పటి నుంచి మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌లో మరో అమెరికన్ మేజర్ టైటిల్ నెగ్గింది లేదు. 

సినర్ ఈజీగా..

ఫైనల్లో  వరల్డ్ నంబర్ వన్‌‌‌‌, టాప్ సీడ్‌‌‌‌‌‌‌‌సినర్ జోరు ముందు 12వ సీడ్ ఫ్రిట్జ్ తేలిపోయాడు. లోకల్ ఫ్యాన్స్‌ సపోర్ట్ ఉన్నా..  పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. బేస్‌‌‌‌‌‌‌‌లైన్ గేమ్‌తో రెచ్చిపోయిన సినర్‌‌‌ మ్యాచ్‌ను ఈజీగా సొంతం చేసుకున్నాడు. తొలి గేమ్‌లోనే బ్రేక్ పాయింట్ సాధించిన సినర్ రెండో గేమ్‌లో సర్వీస్ నిలబెట్టుకొని 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో  గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‎తో ఆకట్టుకున్న ఫ్రిట్జ్ 3–2తో లీడ్‌లోకి వచ్చాడు. కానీ, ఇక్కడి నుంచి సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తన మార్కు ఆట చూపెట్టాడు. 

వరుసగా నాలుగు గేమ్స్ నెగ్గి తొలి సెట్‌‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదో గేమ్‌లో  ఫ్రిట్జ్ సర్వీస్ బ్రేక్ చేసి సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గాడు. మూడో సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి గేమ్‌లోనే  ఓ దశలో 0–4తో నిలిచిన యానిక్‌‌ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి బ్రేక్ పాయింట్‌‌ను కాపాడుకున్నాడు.  ఎనిమిదో గేమ్‌లో సర్వీస్ కోల్పోయి 3–5తో నిలిచిన దశలోనూ సినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏమాత్రం తడబడలేదు. వరల్డ్ నంబర్ వన్ ఆటతో 12వ గేమ్‌లో సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచాడు.

ఫైనల్ మ్యాచ్ సాగిందిలా
సినర్    ఫ్రిట్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
6    ఏస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు    10
5    డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌    4
8/13    నెట్ పాయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌    13/19
6/12    బ్రేక్ పాయింట్స్    2/7
23    విన్నర్స్    29
21    అనవసర తప్పిదాలు    34
96    మొత్తం పాయింట్స్    79

==================================================================