IND vs ENG: జైస్వాల్ వీర ఉతుకుడు.. కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ

IND vs ENG: జైస్వాల్ వీర ఉతుకుడు.. కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ

ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో యంగ్ సంచలనం జైస్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 179 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బ్యాటింగ్ కొనసాగించిన జైస్వాల్..తొలి రోజు ఫామ్ ను చూపిస్తూ తన కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ముంబై కుర్రాడి ఆటతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం భారత్ 7 వికెట్లకు 374 పరుగులు చేసింది. క్రీజ్ లో జైస్వాల్ (200), కుల్దీప్ యాదవ్ (0) ఉన్నారు. జైస్వాల్ ఇన్నింగ్స్ లో 7 సిక్సులు, 18 ఫోర్లు ఉన్నాయి.    

6 వికెట్లకు 336 పరుగులతో ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు అశ్విన్, జైస్వాల్ తొలి అరగంట సేపు అటాకింగ్ గేమ్ ఆడుతూ.. ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. అయితే 34 పరుగుల వీరి భాగస్వామ్యాన్ని అండర్సన్ బ్రేక్ చేశాడు. 20 పరుగులు చేసిన అశ్విన్ వికెట్ కీపర్ ఫోక్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ సహకారంతో జైస్వాల్ తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ టైలండర్లతో ఎంతసేపు బ్యాటింగ్ చేస్తాడో చూడాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 లో మొదటి డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా  జైస్వాల్ నిలిచాడు.   

జైస్వాల్ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శుక్రవారం మొదలైన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా మొదటి రోజు చివరకు 336/6 స్కోరు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, మరో స్పిన్నర్ రెహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌‌‌‌తో ఇండియా బ్యాటర్ రజత్ పటీదార్, ఇంగ్లండ్ స్పిన్నర్ బషీర్ అరంగేట్రం చేశారు.