Yatra 2 OTT: ఓటీటీలోకి రానున్న యాత్ర 2..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Yatra 2 OTT: ఓటీటీలోకి  రానున్న యాత్ర 2..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి పొలిటికల్ జర్నీ, పేద‌ల కోసం చేసిన పాద‌యాత్ర నేపథ్యంలో యాత్ర 2 (Yatra 2) మూవీ తెరకెక్కింది. డైరెక్టర్ మహి వి రాఘవ్(Mahi V Raghav) తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లోకి రిలీజయింది.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదల కోసం,వికలాంగుల కోసం, ప్రతి వ్యక్తి ఆరోగ్య సంరక్షణ కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని చెప్పే ఉద్దేశంలో తీసినఫస్ట్ పార్ట్ యాత్ర ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ, దురదృష్టవశాత్తూ యాత్ర 2 సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేక పోయింది.

అయితే,ఈ సినిమా థియేటర్లో రిలీజ్ 2 నెలలు కావోస్తుండటంతో ఓటీటీ రిలీజ్ డేట్స్ మారుతూ వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, యాత్ర 2 మూవీ 12 ఏప్రిల్ లేదా 19 ఏప్రిల్ తేదీలలో ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్ కానుంది. త్వరలో యాత్ర 2 ఓటీటీ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.అయితే మార్చి 15 న లేదా 16వ తేదీల్లో యాత్ర 2 స్ట్రీమింగ్ కు వస్తుందని అందరూ భావించారు. మరి ఈ లేటెస్ట్ డేట్స్ లో అయిన వస్తుందో లేదో చూడాలి.  

కథేంటంటే:

యాత్ర,యాత్ర 2 ఈవెంట్‌ బేస్డ్‌ బయోపిక్స్ అని చెప్పొచ్చు.వైఎస్సార్‌ మరణం అనంతరం, ఆయన తనయుడు,  వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర..ఆ సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు..ఆ పాదయాత్ర చేపట్టడానికి ఆయనని ప్రేరేపించిన సంఘటనలు, ఆ పాదయాత్ర కారణంగా ప్రజల కష్టాలని స్వయంగా తెలుసుకున్న ఉదంతాల సమాహారమే ‘యాత్ర 2’. వైఎస్సార్‌ మరణం (2009) తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు..తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రలు..వాటన్నింటిని ఎదుర్కొన్ని వైఎస్‌ జగన్‌ ఎలా  ప్రజా నాయ‌కుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ.