ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: విజయసాయిరెడ్డి

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు: విజయసాయిరెడ్డి

ఏపీలో ముందస్తు ఎన్నికలుండవని.. షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  గతంలో కంటే ఈ సారి ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. తాము ఏ కూటమిలో చేరబోమని.. స్వతంత్రంగానే ఉంటామని చెప్పారు.

చంద్రబాబుకు రూ.5 నుంచి 6 లక్షల కోట్ల ఆస్తులున్నాయని ఆరోపించారు విజయసాయిరెడ్డి. సింగపూర్ సహా పలు  దేశాల్లో ఆయనకు ఆస్తులన్నాయని చెప్పారు.  కుంభకోణాల గురించి చంద్రబాబును అడిగితే చెబుతారన్నారు.   లంచాలు తీసుకుని కంచాలు మోగించడమేంటని ప్రశ్నించారు.  కంచాలు ఢిల్లీలో మోగిస్తే బాగుంటుందేమోనన్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ఆఫీస్  ముందు కంచాలు మోగిస్తే బెటరన్నారు. 

చంద్రబాబు,లోకేష్ ఏపీ ప్రజలకు ఏం చెప్ప దలుచుకున్నారో చెప్పాలన్నారు. నిజాయితీ పరులని చెప్పదలుచుకుంటే విచారణ ఎదుర్కోవాలన్నారు.  స్టేలు తెచ్చుకోకుండా లోకేష్ విచారణకు రావాలని సవాల్ విసిరారు. నిజాయితీ పరులైతే తన సవాల్ ను స్వీకరించాలన్నారు. ఏం చేస్తారో చేసుకోండని..బాబు, లోకేష్ పదే పదే చెప్పారన్నారు. చంద్రబాబును ఆధారాలతోనే అరెస్ట్ చేశారని తెలిపారు విజయసాయిరెడ్డి.