తిరుపతిలో భారీ మెజార్టీ దిశగా వైసీపీ

V6 Velugu Posted on May 02, 2021

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైసీపీ భారీ ఆధిక్యం దిశగా ముందుకెళ్తోంది. అన్ని పార్టీలను కాదని వైసీపీ దాదాపు లక్ష ఓట్ల మెజార్టీని సాధించింది. వైసీపీ తరపున పోటీ చేసిన డాక్టర్ గురుమూర్తికి 2,29,424 ఓట్లు పోలయ్యాయి. దాంతో గురుమూర్తికి 95,811 ఓట్ల ఆధిక్యం లభించింది. టీడీపీ నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మీకి 1,33,613 ఓట్లు వచ్చాయి. బీజేపీ, జనసేన తరపున పోటీచేసిన రత్నప్రభకి 23,223 ఓట్లు నమోదయ్యాయి. కాగా.. నోటాకు కూడా వేలల్లో ఓట్లు వచ్చాయి. ఏ అభ్యర్థి నచ్చని ఓటర్లు నోటాకు తమ ఓటు వేశారు. దాంతో నోటాకు 3,594 ఓట్లు పోలయ్యాయి.

 

Tagged Bjp, andhrapradesh, TDP, YSRCP, YCP, Tirupahi by election, Tirupati by election result

Latest Videos

Subscribe Now

More News