సిటీలో ఇయ్యాల ఎల్లో అలెర్ట్

సిటీలో ఇయ్యాల ఎల్లో అలెర్ట్

హైదరాబాద్, వెలుగు: సిటీలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి వర్షం కురిసింది. కూకట్ పల్లి, శేరలింగంపల్లి, షేక్ పేట, లంగర్ హౌస్, టోలిచౌకి వాన పడింది. మరో రెండు రోజులు సిటీలో వానలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం భారీ వర్షం కురిసే చాన్స్​ఉందని ఎల్లో అలెర్ట్(6.4 నుంచి 11.5 సెంటీమీటర్లు) జారీ చేశారు.