ఐపీఎల్ (IPL 2026) మ్యాచ్‌లు ఎంత టెన్షన్‌గా సాగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ అలాంటి టెన్షన్ టైమ్‌లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ముచ్చటను ఆ టీమ్ కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) స్వయంగా బయటపెట్టాడు. హ్యూమన్స్ ఆఫ్ బాంబే' (Humans of Bombay) టాక్ షోలో జతిన్ సప్రుతో మాట్లాడిన అక్షర్ పటేల్.. తన సహచర ఆటగాడు అశుతోష్ శర్మ (Ashutosh Sharma) చేసిన ఒక కామెడీ పనిని గుర్తు చేసుకున్నాడు.
ఫిజియో అడగకముందే.. నేను వర్జిన్ బ్రో!:
ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా అశుతోష్ శర్మ హెల్మెట్‌కు బాల్ బలంగా తాకింది. క్రికెట్ రూల్స్ ప్రకారం అలా హెల్మెట్‌కు బంతి తగిలినప్పుడు.. సదరు బ్యాటర్‌కు తల తిరగడం వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయడానికి ఫిజియో గ్రౌండ్‌లోకి వస్తాడు (Concussion Check).. దీనికోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో క్రెయిగ్ ఆంథోనీ డీ వేమర్న్ మైదానంలోకి వచ్చాడు. ఆ ఫిజియో కనీసం ఒక్క ప్రశ్న కూడా అడగకముందే.. అశుతోష్ శర్మ ఒక్కసారిగా అవును బ్రో.. నేను వర్జిన్‌ని (Yes bro, I'm a virgin) అని గట్టిగా చెప్పేశాడు.. దాంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
నవ్వు ఆపుకోలేకపోయిన ఫిజియో:
అశుతోష్ శర్మ ఇచ్చిన ఆ రాండమ్ ఆన్సర్‌కు ఫిజియో క్రెయిగ్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఆ తర్వాత అతను అశుతోష్‌ను ఇంకేం ప్రశ్నలు అడగకుండా.. నవ్వుకుంటూనే తిరిగి డగౌట్‌కు వెళ్ళిపోయాడు. ఈ విషయంపై అక్షర్ పటేల్ నవ్వుతూ.. బంతి తగిలిన దెబ్బ అశుతోష్‌కు కొంచెం గట్టిగానే తగిలినట్టుందని జోక్ చేశాడు. అశుతోష్ శర్మ చాలా ఫన్నీగా ఉంటాడని అక్షర్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెడీ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ALSO READ : భారత్‌లో ఉండటం కోహ్లీకి ఇష్టం లేదు..
Jatin Sapru - "Funniest things on the field in tense situation ?". (Humans of Bombay)
— VIKAS (@Vikas662005) June 5, 2026
Axar Patel - "Just now, A ball hit on Ashutosh Sharma helmet & physio go for check him".
Axar Patel - "Ashutosh said to Physio, Yes bro I am Virgin". 😂
Jatin Sapru - "It seems the impact… pic.twitter.com/QeNBoOl41L
