ప్రధానిని కాపాడడానికి ప్రధాన్ను తొలగించారు!: ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్

ప్రధానిని కాపాడడానికి ప్రధాన్ను తొలగించారు!: ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంలో ప్రధాని నరేంద్ర మోదీని కాపాడడానికి ధర్మేంద్ర ప్రధాన్​ను తొలగించారని సమాజ్‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. యాంటీ-పేపర్ లీక్స్ చట్టాన్ని సవరించే బిల్లుపై మంగళవారం లోక్‌‌‌‌‌‌‌‌సభలో జరిగిన చర్చలో ఎస్పీ ఎంపీ అఖిలేశ్ మాట్లాడారు. విద్యార్థుల నిరసనలు ప్రభుత్వం దిగివచ్చేలా చేశాయని, వారి డిమాండ్లను అంగీకరించక తప్పలేదని పేర్కొన్నారు. 

ఈ అంశంలో ప్రభుత్వం కలవరపడిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందించారు. సరదాగా ప్రారంభమైనది కాస్తా దేశవ్యాప్త ఉద్యమంగా మారి, ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించేలా చేసిందని అఖిలేశ్ పేర్కొన్నారు.