
హైదరాబాద్: నగరంలో విషాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో యువ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇరిగేషన్ ప్రాజెక్టులో సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వెంకట్ రావు(27) గచ్చిబౌలిలోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దానికి ముందు తన అన్నకు వాట్సప్ మెసేజ్ చేశాడు. కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు మెసేజ్ పెట్టాడు. వెంటనే అనుమానం వచ్చిన వెంకట్ అన్న దీపక్.. పోలీసులకు సమాచారం చేరవేశాడు. పోలీసులు వెళ్లి చూడగా.. అప్పటికే గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకట్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.