V6 News

యువతికి బ్రెయిన్​డెడ్.. ఆర్గాన్స్ డొనేట్ చేసిన పేరెంట్స్

యువతికి బ్రెయిన్​డెడ్.. ఆర్గాన్స్ డొనేట్ చేసిన పేరెంట్స్

హైదరాబాద్‌‌‌‌,  వెలుగు : బ్రెయిన్‌‌‌‌ డెడ్‌‌‌‌ అయిన ఓ యువతి అవయవాలను డొనేట్ చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ముందుకొచ్చారు. వరంగల్‌‌‌‌ జిల్లా తీగరాజుపల్లికి చెందిన రాయపురి జనార్దన్‌‌‌‌,  స్వరూప దంపతుల కూతురు పూజ(16) ఇంటర్ చదువుతోంది. ఈనెల 18న పూజ ఇంట్లో ఉరేసుకుంది. కొన ఊపిరితో ఉండగా కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేటు హాస్పిటల్​కు తరలించారు.  మెరుగైన వైద్యానికి నిమ్స్​కు తీసుకొచ్చారు. ఈనెల 23న రాత్రి 11 గంటలకు పూజను బ్రెయిన్​డెడ్‌‌‌‌గా డాక్టర్లు ప్రకటించారు. అనంతరం జీవన్‌‌‌‌ దాన్‌‌‌‌ కో ఆర్డినేటర్‌‌‌‌‌‌‌‌ యువతి తల్లిదండ్రులకు అవయవదానంపై అవగాహన కల్పించగా వారు అందుకు అంగీకరించారు.