తల్లి మందలించింద‌ని పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్య

తల్లి మందలించింద‌ని పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్య

హైద‌రాబాద్: తల్లి మందలించింద‌ని ఓ యువ‌కుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. న‌గ‌రంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్ల లో ఈ ఘోరం జ‌రిగింది. న‌ల్ల‌గండ్ల‌కు చెందిన‌ సంతోష్ కుమార్(18) అనే యువ‌కుడు డిప్లొమా చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. అటు చదువు చదవక, ఇటు ఉద్యోగం చెయ్యక తిరుగుతుండడంతో అతని తల్లి మందలించింది.దీంతో నిన్న ఉదయం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయాడు.  కుటుంబ స‌భ్యులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదు తో సంతోష్ కుమార్ పై మిస్సింగ్ కేసు నమోదు చేశారు చందానగర్ పోలీసులు. దర్యాప్తులో భాగంగా మొబైల్ లొకేషన్ ఆధారంగా నల్లగండ్ల హుడా లే ఔట్ లో సంతోష్ కుమార్ ఆచూకీ ని కనుగొన్నారు.అప్పటికే సంతోష్ మృతదేహం పూర్తిగా దగ్ధమైంది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.