Vijay Devarakonda : 'కింగ్ డమ్' ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం ఖరారు.. తిరుపతిలో భారీ ఈవెంట్!

Vijay Devarakonda : 'కింగ్ డమ్' ట్రైలర్ లాంచ్ కు ముహూర్తం ఖరారు.. తిరుపతిలో భారీ ఈవెంట్!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ), భాగ్యశ్రీ బోర్సే ( Bhagyashree Borse )ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'కింగ్ డమ్' (  Kingdom ). పాన్ ఇండియా మూవీగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి ( Gautham Tinnanuri )దర్శకత్వం వహించారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో 'కింగ్ డమ్' ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. 

ఇందులో భాగంగా తిరుపతిలో భారీ ఈవెంట్ ను మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ వేదిక మీద నుంచే  జూలై 26న 'కింగ్ డమ్' ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.  దీంతో అభిమానుల్లో సందడి నెలకొంది. వేదికపై విజయ్ దేవరకొండ 40 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు.  దీనికి సంబంధించిన ఫోటోను సితార ఎంటర్టైన్మెంట్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. విజయ్ దేవరకొండ ఇటీవల డెంగ్యూతో ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం ఇంటి వద్దే విశాంత్రి తీసుకుంటున్నారు.

 

పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను హిందీలో 'సామ్రాజ్య' అనే కొత్త టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో 'ఎన్టీఆర్', తమిళంలో 'సూర్య', హిందీలో ' రణ్ బీర్ కపూర్' వాయిస్ ఓవర్స్ ఇచ్చారు. విజయ్ కి నార్త్ ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.  ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ను ఏఏ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.

►ALSO READ | Thalaivan Thalaivii Review: విజయ్ సేతుపతి 'తలైవన్ తలైవి'.. అంచనాలను అందుకుందా?

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే  నటించింది. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాలకాలపై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. హై ఆక్టేన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ  కింగ్ డమ్..  తొలుత మార్చి 30న విడుదల కావాల్సి ఉంది. అయితే నిర్మాణ సంబంధిత అడ్డంకుల కారణంగా ఆలస్యమైంది. చివరకు జూలై 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి మరి.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సామ్రాజ్య అనే కొత్త టైటిల్ తో హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నమ్మకద్రోహం, ప్రతీకారానికి సంబంధించిన గొప్ప కథను ఈ చిత్రం ప్రజెంట్ చేస్తుంది. అడ్వైస్ మూవీస్ పతాకంపై ఆదిత్య భాటియా, అతుల్ రజని సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సామ్రాజ్య'. ఎన్టీఆర్ (తెలుగు), సూర్య (తమిళం), రణ్ బీర్ కపూర్ (హిందీ) వాయిస్ ఓవర్స్ తో విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. హిందీ డబ్బింగ్ వెర్షన్ ను నార్త్ ఇండియా అంతటా ఏఏ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేయనుంది.