
ములుగు జిల్లా: వాజేడు మండలం బోగత జలపాతంలో స్నానం చేస్తూ గల్లంతైన యువకుడి మృతదేహం లభించింది. హన్మకొండకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి గోపీచంద్( 25) హైదరాబాద్ కు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చాడు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల బోగత జలపాత సందర్శనకు అనుమతి ఇవ్వలేదు. దాంతో వీరంతా అక్రమ మార్గం ద్వారా జలపాతం వద్దకు చేరుకొని స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు గోపిచంద్ గల్లంతయ్యాడు. దాంతో తోటి స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. రెస్యూ టీంతో జలపాతం వద్దకు చేరుకున్న పోలీసులు.. గల్లంతైన వ్యక్తి కోసం ఆదివారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. కాసేపటి తర్వాత గోపిచంద్ మృతదేహం లభించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
For More News..