మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో దారుణం జరిగింది. రైల్వే స్టేషన్ పరిధి మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలో రైలు కింద పడి బూర సురేష్(30) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి కావట్లేదని మనస్థాపంతో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ ఆత్మకూరుకి చెందిన నరేష్ హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ బట్టల షాపులో ఉద్యోగం చేస్తున్నాడు. అమీర్ పేట నుంచి ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోకి వచ్చి రేపల్లె ఎక్స్ప్రెస్ రైలు కింద పడి నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నాలుగేళ్లుగా పెళ్లి సంబంధాలు కుదురుటలేదని నరేష్ మదనపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పెళ్లి సంబంధాలు కుదురుటలేదని మనస్థాపంతో సురేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.
