
మెదక్ (చిన్నశంకరంపేట), వెలుగు: ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో పాటు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం... చిన్నశంకరం పేట మండలం శాలిపేట గ్రామానికి చెందిన రాగుల ఆంజనేయులు గౌడ్ (28) తల్లి సుజాతతో కలిసి గవ్వలపల్లిలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గతంలో అన్న యాదగిరి గౌడ్‌ను హత్య చేసిన కేసులో ఆంజనేయులు గౌడ్ జైలుకు వెళ్లాడు. ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆయనకు ఎవరూ పని ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి.
అంతేకాదు పెళ్లి సంబంధాలు కూడా రాకపోవడంతో మనోవేదనకు గురై గురువారం ఇంట్లో ఫ్యాన్ ఉరేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం రామయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు.