కూకట్ పల్లిలో కారు బీభత్సం.. వ్యక్తి మృతి

కూకట్ పల్లిలో కారు బీభత్సం.. వ్యక్తి మృతి

హైదరాబాద్: కూకట్‌పల్లి కె.పి.హెచ్.బి. కాలనీ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఓ కారు బీభత్సం సృష్టించింది. TS06GE6999 నంబర్ గల బ్రెజా కార్ అదుపు తప్పి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా ఓ స్విఫ్ట్ కారు, ఒక ఆటో, ద్విచక్ర వాహానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువ‌కుడి తలకు తీవ్రగాయాలు అవ్వడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదానికి కారణం అతివేగమే అంటున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన కారు డ్రైవ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.