వాళ్లకు కూడా తెలియదా : మెడికల్ షాపులోనే.. గుండెపోటుతో యువకుడు మృతి

వాళ్లకు కూడా తెలియదా : మెడికల్ షాపులోనే.. గుండెపోటుతో యువకుడు మృతి

ఏదైనా అనారోగ్యం అయితే వెంటనే మనకు గుర్తొచ్చేది డాక్టర్ కాదు.. మెడికల్ షాపు. ముందు ఓ ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకుంటారు.. తమ బాధ చెప్పి ఓ ట్యాబ్లెట్ తీసుకుంటారు జనం.. అలాంటి మెడికల్ షాపులోనే.. మెడికల్ షాపు సిబ్బంది ఎదుటే.. ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. గుండెనొప్పితో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషాధ ఘటన హైదరాబాద్ సిటీ రాజేంద్రనగర్ ఏరియాలో జరిగింది. 

ఇక్కడ డౌట్ ఏంటంటే.. మెడికల్ షాపు సిబ్బంది వెంటనే స్పందించిన ఓ ట్యాబ్లెట్ ఇచ్చినా లేక పీసీఆర్ చేసినా బతికేవాడు కదా అనే డౌట్స్ జనం నుంచి వస్తున్నాయి. మెడికల్ షాపు అంటేనే అత్యవసరానికి ఉపయోగపడేది.. అలాంటి షాపులోనే ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలితే ఏం చేయాలో ఆ మెడికల్ షాపు వాళ్లకు తెలియదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

బుద్వేల్ వద్ద ఉన్న మెడికల్ షాపుకు  మందుల కోసం ఓ యువకుడు వచ్చాడు. అక్కడ తనకు కావాల్సిన మెడిసిన్స్ తీసుకుంటూ షాప్ ముందు కుప్పకూలిపోయాడు. దీంతో  మెడికల్ షాపు సిబ్బంది షాక్ కు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది.  గుండెపోటు రావడంతోనే అతను మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మృతుడిని బుద్వేల్ కు చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు.  భర్త మరణంతో అతని భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.