
నిర్మల్ : బాసర సరస్వతి ఆలయం దగ్గర ఓ సైకో కత్తులతో అలజడి సృష్టించాడు. గురువారం ఉదయం ఆలయంలో భక్తుల దగ్గరకు వెళ్లి ఓ యువకుడు కత్తులతో బెదిరించాడు. భయంతో పరుగులు తీశారు భక్తులు. తర్వాత ఆలయం బయటకు వచ్చి తానే కత్తులతో పొడుచుకుని చనిపోతానంటూ అరిచాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సైకోను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
సూసైడ్ అటెప్ట్ చేసిన వ్యక్తి నిజంగానే సైకోనా..కాదా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని తెలిపారు పోలీసులు. అవసరమైతే అతడికి మెడికల్ టెస్ట్ లు జరుపుతామని..అతడి కుటుంబసభ్యులను అడిగి పూర్తిగా వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఆ వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లాక ఆలయంలోకి భక్తులను యధావిధిగా దర్శనం కోసం అనుమతించారు. భక్తుల భయపడాల్సిన అవసరంలేదని తెలిపారు ఆలయ అధికారులు.