
మేడ్చల్ జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిదిలోని మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీలో ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో నిల్వ ఉంచిన డిజిల్, కిరోసిన్, వైట్ టినర్ డబ్బాలకు మంటలు అంటుకుని చెలరేగాయి. ఈ ఘటనలో అనిల్ అనే వ్యక్తి మంటలో చిక్కొని పోగ వ్యాపించడంతో సృహ కోల్పోయాడు. స్థానికులు గుర్తించి అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఇండ్లలో కిరోసిన్ కార్పేంటయిల్ ఉంచవద్దని చెప్పిన కూడా పట్టుంచుకొలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో అక్రమంగా ఆయిల్ నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు.