లవ్ ట్రాప్ లో దింపి బాలికలపై యువకులు దాడి.. పోలీసుల అదుపులో నిందితులు

లవ్ ట్రాప్ లో దింపి బాలికలపై యువకులు  దాడి.. పోలీసుల అదుపులో నిందితులు

అల్వాల్, వెలుగు: బాలికలను మాయమాటలతో లవ్​ ట్రాప్​లో దింపిన యువకులు ముగ్గురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులను అల్వాల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. సీఐ ప్రశాంత్ తెలిపిన ప్రకారం.. 

అల్వాల్ లోని ఓ స్కూల్​లో తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు ఈ నెల 20న సికింద్రాబాద్ కు వెళ్లారు. అక్కడి నుంచి ఓయూ ప్రాంతానికి వెళ్లారు. అక్కడే రోడ్డుపై వెళ్తున్న మధు అనే యువకుడితో మాటలు కలిశాయి. సదరు యువకుడు తన స్నేహితులైన పెంట్రోల్ బంక్ లో పని చేసే నీరజ్, ఒక మాల్​లో పనిచేసే నానిని అక్కడికి పిలిచి వారికి పరిచయం చేశాడు. 

ముగ్గురు బాలికలకు ఈ ముగ్గురు యువకులు స్నేహితులుగా, ప్రేమికులుగా మారారు. ముగ్గురు యువకులు బాలికలను నమ్మించి యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. అక్కడ ఓ లాడ్జీ తీసుకుని వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి ముగ్గురు యువకులతో పాటు హోటల్ యజమానిని అరెస్ట్​ చేశారు.