ఎగ్జామ్ లేదు ఓన్లీ ఇంటర్వ్యూ.. ఎంకామ్, ఎంబీఏ అర్హతతో ఉద్యోగాలు..

ఎగ్జామ్ లేదు ఓన్లీ ఇంటర్వ్యూ..  ఎంకామ్, ఎంబీఏ అర్హతతో ఉద్యోగాలు..

ఐసీఎంఆర్ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ఎపిడెమియాలజీ(ఐసీఎంఆర్ ఎన్ఐఈ) యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఐసీఎంఆర్ ఎన్ఐఈ వెబ్​సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ మే 29. 

  • పోస్టులు: 4 (యంగ్ ప్రొఫెషనల్స్ –II (ఎఫ్​ అండ్ ఏ) 01, యంగ్ ప్రొఫెషనల్స్ –II 03)
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంకాం, ఎంబీఏ/ పీజీడీఎం, సంబంధిత ట్రేడులో పోస్టు గ్రాడ్యుయేషన్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు.  నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్లు ప్రారంభం: మే 09.
  • లాస్ట్ డేట్: మే 29. 
  • సెలెక్షన్ ప్రాసెస్: పని అనుభవం, ఇంటర్వ్యూలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.పూర్తి వివరాలకు icmr.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

►ALSO READ | ఐసీఎంఆర్ ఎన్ఐఆర్​బీఐలో కన్సల్టెంట్ ఉద్యోగాలు