అహంకారానికి మీ ఫ్యామిలీబ్రాండ్ అంబాసిడర్ : కేటీఆర్‌పై ట్విటర్‌లో సీతక్క ఫైర్

అహంకారానికి మీ ఫ్యామిలీబ్రాండ్ అంబాసిడర్ : కేటీఆర్‌పై ట్విటర్‌లో సీతక్క ఫైర్

హైదరాబాద్, వెలుగు :  కేటీఆర్ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని మంత్రి సీతక్క విమర్శించారు. శుక్రవారం ఆమె ‘ఎక్స్’లో పోస్ట్​పెట్టారు. ‘‘అహంకారానికి బ్రాండ్ అంబాసిడరే మీ కుటుంబం. అందుకే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు.

దొర అహంకారానికి ప్రతిరూపం మీ పాలన. ప్రజాపాలనకి నిలువెత్తు నిదర్శనం మా పాలన. అధికారం లేనప్పుడు తెలంగాణ ఉద్యమ ముసుగు కప్పుకొని, అధికారంలోకి వచ్చాక ప్రజలని బానిసల కంటే హీనంగా చూసిన మీ చరిత్రని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు’’ అని ఆమె పేర్కొన్నారు.