బరువు తగ్గేందుకు చాలామంది ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు. ఎంత కష్టపడినా మార్పు కనిపించదు. ఆహార అలవాట్లు పాటించినా అలానే ఉంటారు. అలాంటి వారు బరువు తగ్గడానికి ఏం చేయాలంటే..
* శరీరానికి కావాల్సినన్ని నీళ్లు తాగకపోయినా.. ఆ ప్రభావం బరువుపై పడుతుంది. డీహైడ్రేషన్ కారణంగా మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయవు. దీంతో కాలేయంపై కూడా ప్రభావం పడుతుంది. ఎక్కువ కొవ్వును కరిగించే సామర్థ్యం కాలేయం కోల్పోతుంది. కేలరీలు తగ్గకపోవడంతో బరువులో ఎలాంటి మార్పు కనిపించదు.
* ఉద్యోగం చేసేవాళ్లు కూడా బరువు తగ్గరు. వ్యాయామం చేసినప్పటికీ ఎక్కువ సేపు కూర్చుంటారు. కాబట్టి బరువు తగ్గరు. ఎక్కువ సేపు కూర్చోకుండా కనీసం ఇరవై, ముప్పై నిమిషాలకైనా నడక అవసరం. లిఫ్ట్కు బదులు మెట్ల ద్వారా నడవాలి.
* చాలామంది సరైన డైట్ పాటించరు. పాటించినా కొద్ది రోజులకే పరిమితం చేస్తారు. బరువు తగ్గడానికి ఎన్నిరోజులపా టు డైట్ పాటించాలనుకుంటే.. అన్ని రోజులు పాటించాల్సిందే. సరైన డైట్ పాటించకపోవడం వల్ల కూడా బరువు తగ్గరు.
* సరైన వేళలో నిద్ర పోకపోవడం వల్ల కూడా ప్రభావం పడుతుంది. కనీసం 7 గంటలైనా నిద్రపోవాలి. నిద్ర తక్కువయితే ఏదైనా తినాలనిపిస్తుంది. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల బరువుపై ప్రభావం చూపుతుంది.
* వ్యాయామం చేశాక చాలామంది ఎక్కువగా తినేస్తుంటారు. ఈ కారణంగా కూడా బరువులో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి తేలికపాటి ఆహారం ఎక్కువసార్లు తీసుకోవచ్చు.
కొంతమంది ఒకే రకమైన వ్యాయమాలు చేస్తుంటారు. అలా కాకుండా డిఫరెంట్ ఎక్సర్ సైజ్ లు చేస్తే బాగుంటుంది. దీని వల్ల కేలరీలు తగ్గి బరువును తగ్గిస్తాయి. కొత్త వ్యాయమాలు చేస్తే ఫలితం ఉంటుంది.
* చిన్నచిన్న విషయాలకే చాలామంది ఒత్తిడికి గురౌతుంటారు. దీని వల్ల జీర్ణక్రియ సరిగా పని చేయదు. బరువులో ఎలాంటి మార్పు ఉండదు. అందుకని ఒత్తిళ్లు నెత్తికి ఎత్తుకోవద్దు.
