V6 News

యువతి పోలీస్ కంప్లయింట్ ఇచ్చిందని.. హైవోల్టేజ్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్

యువతి పోలీస్ కంప్లయింట్ ఇచ్చిందని.. హైవోల్టేజ్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్

ఈ మధ్య కాలంలో కొందరి యువకుల వింత ప్రవర్తనతో పోలీసులు తిప్పలు తప్పడం లేదు.. వ్యక్తిగత సమస్యలున్నా,  సామాజికంగా సమస్యలున్నా వాటిని సంబంధిత  వ్యక్తులతో పరిష్కరించుకోవాల్సింది పోయి సెల్ టరర్లు, హైవోల్టేజీ టవర్లు ఎక్కడం పరిపాటిగా మారింది. అంతటితో ఆగకుండా దూకుతాం.. ఆత్మహత్య చేసుకుంటాం.. దగ్గరికి వస్తే ఇప్పుడు దూకేస్తాం అంటూ బెదిరిస్తుంటారు. ఇలాంటి ఘటనలు పోలీసు అధికారులు తలనొప్పిగా మారాయి.. ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ సిటీలోని మోతీనగర్ లో చోటు చేసుకుంది. యువతి ఫిర్యాదు చేసిందని ఓ యువకుడు హై వోల్టేజీ టవర్ ఎక్కి నానా హంగామా చేశారు.  అతనిడిని కిందదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

బోరబండ పరిధిలోని మోతీనగర్ చౌరస్తా దగ్గర నిల్సన్ రాజ్ అనే యువకుడు బుధవారం (ఏప్రిల్ 22)  ఉదయం హంగామా సృష్టించాడు. తనపై ఓ యువతి తప్పుడు ఫిర్యాదు చేసిందని చేతిలో పెట్రోల్ బాటిల్‌తో హై వోల్టేజ్ టవర్ ఎక్కాడు. టవర్ పైభాగం చివరన కూర్చుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టవర్ నుంచి సురక్షితంగా కిందకు దించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.