సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ను అరెస్టు చేయాలి..ఈసీ ఆఫీసు ముందు యూత్ కాంగ్రెస్ ధర్నా

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ను అరెస్టు చేయాలి..ఈసీ ఆఫీసు ముందు యూత్ కాంగ్రెస్ ధర్నా

హైదరాబాద్, వెలుగు: ఓట్ చోరీకి పాల్పడ్డ సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా చేపట్టారు. బీఆర్‌‌‌‌కే భవన్‌‌‌‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించారు.  ఆఫీసు ఎదుట బైఠాయించి సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.

నిరసనకారులను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులకు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి నాయత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు రాష్ట్ర స్థాయి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివచరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసేవరకు రాష్ట్రవ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.