పోలీస్ ఉద్యోగాల గందరగోళంపై ప్రగతిభవన్ ముట్టడి

పోలీస్ ఉద్యోగాల గందరగోళంపై ప్రగతిభవన్ ముట్టడి

హైదరాబాద్ : ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డితో పాటు మరికొంతమంది నేతలను అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కరువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతీ, యువకులు ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. 

పోలీస్ ఉద్యోగాల భర్తీ విషయంలో ఏర్పడిన గందరగోళంపై ప్రగతిభవన్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ప్రగతిభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విడతల వారీగా ప్రగతిభవన్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు. మరోవైపు.. 3 రోజుల క్రితం ఇందిరాపార్క్ వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు ‘సమరదీక్ష’ చేసిన విషయం తెలిసిందే.