వాళ్ల టార్గెట్ కోహ్లీ, ధోనీ కాదు.. యువ క్రికెటర్లే

వాళ్ల టార్గెట్ కోహ్లీ, ధోనీ కాదు.. యువ క్రికెటర్లే

యువ క్రికెటర్లే బుకీల టార్గెట్‌‌

ముంబై : మ్యాచ్ ఫిక్సర్లు, బుకీలు.. విరాట్‌‌ కోహ్లీ, ఎంఎస్‌‌ ధోనీ లాంటి స్టార్‌‌ ఆటగాళ్ల కోసం తమ టైమ్‌‌ను వృథా చేయరని, యువ ఆటగాళ్లనే టార్గెట్‌‌ చేస్తారని బీసీసీఐ యాంటీ కరప్షన్‌‌ యూనిట్‌‌(ఏసీయూ) చీఫ్‌‌ అజిత్‌‌ సింగ్‌‌ తెలిపారు. ఇటీవల స్టార్ క్రికెటర్ల సంపాదన చూస్తే ఫిక్సింగ్‌‌కు పాల్పడితే పరువు పోగొట్టుకోవడం తప్ప వాళ్లకి ఒరిగేదేమి ఉండదన్నారు. పేరు ప్రఖ్యాతులను దృష్టిలో ఉంచుకుని స్టార్‌‌ క్రికెటర్లు ఎంత డబ్బు ఆశచూపినా బుకీలకు సహకరించరన్నారు. అందువల్ల జట్టులోకి వస్తూపోతూ ఉన్న ఆటగాళ్లు, యంగ్‌‌స్టర్స్‌‌కు భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపి బుకీలు ఉచ్చులోకి లాగుతారని తెలిపారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌ తరహాలో కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తేనే ఫిక్సింగ్‌‌ను అరికట్టగలమని అజిత్‌‌ అన్నారు.