పరిగి, వెలుగు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. చోన్గొముల్ఎస్సై భరత్ కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని ఎన్కెపల్లికి చెందిన హరిశంకర్‌గౌడ్(23) బైక్‌పై సోమవారం రాత్రి గ్రామం నుంచి మన్కెగూడ వెళ్తున్నాడు. అదే సమయంలో పాతూరు నుంచి పత్తి అన్లోడ్ చేసి వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరిశంకర్గౌడ్అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా మృతుడి కుటుంబసభ్యులు మొదట హరిశంకర్ గౌడ్‌ది హత్య అని భావించారు. కానీ పోలీసులు విచారణలో రోడ్డు ప్రమాదంగా తేల్చారు.

