
ఆదిలాబాద్అర్బన్, వెలుగు: తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని తక్షణమే భర్తీ చేయాలనే డిమాండ్తో ట్విట్టర్ వేదికగా ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ జేఏసీ అధ్యక్షులు ఎల్చల దత్తాత్రేయ పేర్కొన్నారు.స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలంటే మొద్దునిద్రలో ఉన్నప్రభుత్వాన్నినిద్ర లేపాల్సిన అవసరముందన్నా రు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ కు రాష్ట్రంలోని నిరుద్యోగులంతా ఉద్యోగాల భర్తీ కోరుతూ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2సార్లు ట్వీట్ చేయాలని పిలుపునిచ్చారు.