యూట్యూబ్‌‌‌‌ ఇండియాకు ఎన్‌‌‌‌సీపీసీఆర్‌‌‌‌ సమన్లు

యూట్యూబ్‌‌‌‌ ఇండియాకు ఎన్‌‌‌‌సీపీసీఆర్‌‌‌‌ సమన్లు

న్యూఢిల్లీ: యూట్యూబ్‌‌‌‌లో కొన్ని చానెళ్లు తల్లీ కొడుకులకు సంబంధించి అసభ్యకర వీడియోలను పోస్ట్‌‌‌‌ చేస్తుండటంపై నేషనల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ ఫ్రొటెక్షన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ చైల్డ్‌‌‌‌ రైట్స్ (ఎన్‌‌‌‌సీపీసీఆర్‌‌‌‌‌‌‌‌) ఆగ్రహం వ్యక్తం చేసింది. యూట్యూబ్‌‌‌‌ ఇండియాకు ఎన్‌‌‌‌సీపీసీఆర్‌‌‌‌‌‌‌‌ ఈ మేరకు బుధవారం సమన్లు జారీ చేసింది. 

ఇలాంటి వీడియోలు చిన్నారుల భద్రత, శ్రేయస్సుకు హాని కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంది. వీటిని మైనర్లు కూడా చూసేందుకు వీలుండటం ఆందోళనకరమని చెప్పింది. ఆ  కంటెంట్‌‌‌‌ తొలగించేందుకు ఏం చేస్తున్నారో చెప్పాలని ఆదేశించింది. 

యూట్యూబ్‌‌‌‌లో ప్లే అవుతున్న అలాంటి చానళ్ల లిస్టుతో జనవరి 15న హాజరు కావాలని ఇండియాలోని యూట్యూబ్‌‌‌‌ పబ్లిక్‌‌‌‌ పాలసీ హెడ్‌‌‌‌ కు కూడా చైల్డ్‌‌‌‌ రైట్స్‌‌‌‌ కమిషన్‌‌‌‌ లేఖ రాసింది. ‌‌‌‌