పెళ్లి పేరుతో మోసం... యూ ట్యూబర్‌‌‌‌ హర్షసాయిపై కేసు

పెళ్లి పేరుతో మోసం... యూ ట్యూబర్‌‌‌‌ హర్షసాయిపై కేసు

గండిపేట, వెలుగు: పెళ్లి  పేరుతో  మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదుతో యూ ట్యూబర్‌‌‌‌ హర్షసాయి పై నార్సింగి పీఎస్​లో కేసు నమోదైంది.  పోలీసుల వివరాల ప్రకారం యూట్యూబ్‌‌‌‌లో పలు కార్యక్రమాలు చేస్తూ  హర్షసాయి పాపులర్​ అయ్యాడు. మెగా అనే   సినిమాలో  హీరోగా కూడా చేశాడు.

ఈ క్రమంలో  తనను హర్ష సాయి పెళ్లి చేసుకుంటానని  మోసం చేశాడని,  రూ. 2 కోట్ల  డబ్బు  తీసుకున్నాడని  అతనిపై, అతని తండ్రిపై  ఓ యువతి పోలీసులకు  ఫిర్యాదు చేసింది.  దీంతో   హర్ష సాయిపై  వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.