నదుల అనుసంధానంపై కేసీఆర్, జగన్ చర్చ

నదుల అనుసంధానంపై కేసీఆర్, జగన్ చర్చ

మూడు గంటలుగా CM క్యాంప్ ఆఫీసులో భేటీ అయిన కేసీఆర్, జగన్.. నదుల అనుసంధానంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి గోదావరి, కృష్ణ నీళ్లను ఎలా వాడుకోవాలన్న దానిపై ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు అందించారు. దీనిపైనే ముఖ్యంగా చర్చిస్తున్నారు సీఎంలు. దుమ్ముగూడెం దగ్గర ప్రాజెక్టు కట్టి.. అక్కడ్నుంచి శ్రీశైలానికి నీటిని తరలించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

CWC 50 ఏళ్ల లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో రెండు నదుల నుంచి దాదాపు 3వేల TMCలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. ఈ నీటిని వాడుకుంటూ రెండు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికి నీళ్లు ఇవ్వాలన్నది సీఎంల ఆలోచన. దీనికోసం ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై నేతలు మాట్లాడుతున్నట్లు సమాచారం.

నదుల అనుంసంధానంతో పాటు.. ఉద్యోగుల విభజన, కార్పొరేషన్ల ఆస్తుల పంపకాలు, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, విజయవాడలోని ఆప్మెల్ ఆస్తుల పంపకంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.