మీరు చేసిన తప్పుకు రైతులను దొంగల్ని చేశారు

మీరు చేసిన తప్పుకు రైతులను దొంగల్ని చేశారు

రైతుల రుణమాఫీ చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తీసుకున్న రుణాలు చెల్లించలేక రైతులు చనిపోతున్నారని దానికి కారణంగా టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. మీరు రుణమాఫీ చేసి ఉంటే రైతుల ఇంట్లో సామాన్లు బ్యాంకులు జప్తు చేసేవా? రైతులు తప్పు చేసిన వారిలా నిలబడేవారా? మీరు చేసిన తప్పుకు రైతులను దొంగలు చేశారంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు వైఎస్ షర్మిల. అంతే కాదు..సమాజంలో వాళ్ళ గౌరవాన్ని పోగొట్టారు. మీరు రుణమాఫీ చేయరు. ఆత్మహత్యలు చేసుకోకుండా రైతులకు అండగా ఉండరు. రైతులపై మీ ప్రేమ అంతా డ్రామా అని ఫైర్ అయ్యారు.

నిన్న ఇండ్లల్ల పనులు చేసుకుంటూ, దివ్యాంగుడైన భర్తను, ఇద్దరు పిల్లలను పోషించుకునే మహిళకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాలంటే తాళి బొట్టు నమ్మి మరీ లక్ష రూపాయల లంచం ఇవ్వాలని అడిగిన అధికార్లకు సిగ్గుండాలి. మీకు జీతాలు వస్తలేవా లేక సరిపోతలేవా యథా మంత్రి తథా అధికారులు.తలదించుకోవాలని అన్నారు. లక్ష రూపాయల రుణమాఫీని లక్షణంగా వదిలేసిన కేసీఆర్ గారు, రైతులను బ్యాంకర్ల దృష్టిలో రుణ ఎగవేతదార్లను, దొంగలను చేసి ఓట్లేసిన రుణం తీర్చుకొంటున్నారా? రుణమాఫీ కోసం ఎదురుచూసిన రైతులు ఈ రోజు రుణం కట్టలేక, వడ్డీ పెరిగిపోయి, ఆస్తులను బ్యాంకులు జప్తు చేసుకొనేవరకు తీసుకొచ్చారు కదా దొర అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు వైఎస్ షర్మిల.

 

మరిన్ని వార్తల కోసం..

ఏ బట్టలు ధరించాలనేది ఆడవాళ్ల ఇష్టం