జులై 8న షర్మిల కొత్త పార్టీ

జులై 8న  షర్మిల కొత్త పార్టీ

ప్రశ్నించడానికి ..నిలదీయడానికే తమ పార్టీ అవసరమన్నారు వైఎస్ షర్మిల. ఖమ్మంలో సంకల్ప సభలో మాట్లాడిన ఆమె... చేవెళ్ల నుంచే వైఎస్ ఆర్  తొలి అడుగు మొదలైందని.. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఏప్రిల్ 9నే వైఎస్ ఆర్ ప్రజాప్రస్థానం పాదయాత్రతో మొదలైందన్నారు. ఇపుడు అదే రోజు ఖమ్మం గడ్డ నుంచి రాజన్న సంక్షేమ పాలన తేవాలని సంకల్పిస్తున్నామన్నారు. రాజకీయ పార్టీ పెట్టబోతున్నామన్నారు.జులై 8నే కొత్త పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామన్నారు. 

తెలంగాణలో రైతుల పేరు మీద అప్పులు చేసి జేబులు నింపుకుంటున్నారన్నారు. వైఎస్ఆర్ చేపట్టిన ప్రాజెక్టును కేసీఆర్ రీ డిజైన్ చేశారన్నారు. కౌలు రైతులను పాలకులు పట్టించుకోవడం లేదన్నారు.కమీషన్లు దండుకుని జేబులు నింపుకుంటున్నారన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ పూర్తిగా ఇవ్వడం లేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని  ఇచ్చారా? అని ప్రశ్నించారు. సీఎంను నిలదీయడానికి తమ పార్టీ అవసరమన్నారు. కేసీఆర్ ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించడం లేదన్నారు.  కేజీ టూ పీజీ విద్య ఏమైందని..ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ఎన్ని ఇండ్లు కట్టారో చెప్పాలన్నారు. ఉద్యోగం రాలేదని సునీల్  నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని..విద్యార్థులు చనిపోతున్నా పాలకులకు పట్టడం లేదన్నారు. నీళ్లు,నిధులు నియమకాలన్నారు..నీళ్లు ఎక్కడిచ్చారు..నియామకాలెక్కడ జరిగాయన్నారు.